Wednesday, January 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ జీవితం స్ఫూర్తిదాయకం టార్చ్ బేరర్ సయ్యద్ నశీర్ అహమ్మద్” పుస్తక...

చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ జీవితం స్ఫూర్తిదాయకం టార్చ్ బేరర్ సయ్యద్ నశీర్ అహమ్మద్” పుస్తక ఆవిష్కరణ

డైనమిక్ న్యూస్,గుంటూరు, జనవరి 6

తెనాలి పట్టణంలోని వివేక సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన జీవన విశేషాలతో రూపొందిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

డెన్మార్క్ తెలుగు సంఘం అధ్యక్షుడి చేతుల మీదుగా ఆవిష్కరణ

ప్రముఖ జర్నలిస్టు బి.ఎల్. నారాయణ రచించిన “టార్చ్ బేరర్ సయ్యద్ నశీర్ అహమ్మద్” పుస్తకాన్ని గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు డెన్మార్క్ నుంచి విచ్చేసిన పొట్లూరి అమర్నాథ్ (వ్యవస్థాపక అధ్యక్షుడు – డెన్మార్క్ తెలుగు సంఘం & మన సంస్కృతి, డెన్మార్క్) ఆవిష్కరించారు.

సయ్యద్ నశీర్ అహమ్మద్‌కు ఘన సన్మానం

ఈ సందర్భంగా సయ్యద్ నశీర్ అహమ్మద్‌ను శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి, ఆయన చరిత్ర పరిశోధన సేవలను వక్తలు కొనియాడారు.

అధ్యక్షత వహించిన రావిపాటి వీర నారాయణ

వివేకా విద్యాసంస్థల అధినేత రావిపాటి వీర నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత బి.ఎల్. నారాయణతో పాటు పలువురు మేధావులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

సంస్కృతి, చరిత్ర పరిరక్షణకు దోహదం

ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు చరిత్రపై అవగాహన కల్పించడంతో పాటు, సమాజానికి స్ఫూర్తినిచ్చే గ్రంథంగా నిలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments