నేరేడుచర్ల , డైనమిక్ న్యూస్,డిసెంబర్ 27
జనవరి 30న జరగనున్న తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి సభ్యుడిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 29న హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రెండు దశాబ్దాల సేవా ప్రస్థానం
గత రెండు దశాబ్దాలుగా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాముల రామిరెడ్డి, న్యాయవాదుల సంక్షేమం కోసం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టారు. హుజూర్నగర్ కోర్టు అభివృద్ధికి సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు సమకూర్చి, ఆధునిక కోర్టు సముదాయాన్ని నిర్మింపజేయడంలో కీలక పాత్ర పోషించారు.
కోర్టుల విస్తరణకు నిరంతర కృషి
కేవలం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పరిమితమైన హుజూర్నగర్ కోర్టుకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లా అదనపు కోర్టుతో పాటు మరో రెండు అదనపు జూనియర్ సివిల్ కోర్టులు మంజూరు అయ్యేలా అవిశ్రాంతంగా కృషి చేసి విజయం సాధించారు.
న్యాయవాదులకు అన్నదాతలా…
జూనియర్, సీనియర్ న్యాయవాదులకు “అన్నా అంటే నేనున్నాను” అన్నట్లుగా సహాయ, సహకారాలు అందిస్తూ అందరి మన్ననలు పొందారు. న్యాయవాదుల సమస్యలతో పాటు ప్రజా సమస్యలను కూడా తన సమస్యలుగా భావించి బాధ్యతగా పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు సాగుతున్నారు.
రాష్ట్రస్థాయిలో న్యాయవాదుల సమస్యల పరిష్కార లక్ష్యం
ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు పాత్ర పోషించాలని సాముల రామిరెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు.
నామినేషన్‌కు భారీగా తరలిరావాలి
ఈనెల 29న హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో జరగనున్న నామినేషన్ కార్యక్రమానికి హుజూర్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రామిరెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, మేధావులు, అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
