నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 6
నేరేడు చర్ల మండలం లాల్ లక్ష్మిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 1వ వార్డు మెంబర్ అభ్యర్థిగా గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ తన నామినేషన్ను అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు భారీ ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఉత్సాహంగా నామినేషన్ ప్రక్రియ
నామినేషన్ ప్రక్రియ సజావుగా పూర్తికాగా, గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పవన్ కుమార్ యాదవ్కు మద్దతుగా వచ్చిన ప్రజలతో పరిసరాలు కిటకిటలాడాయి. నామినేషన్ తరువాత అభ్యర్థికి మద్దతుగా నినాదాలు మిన్నంటాయి.
ప్రజల ఆశీర్వాదంతోనే విజయం
ఈ సందర్భంగా గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ,“గ్రామ ప్రజలు, ఓటర్లు తమ ఆశీర్వాదంతో నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. వార్డు అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తాను” అని తెలిపారు.
