Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంత్వరలో సీఎంతో బొట్టుగూడ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

త్వరలో సీఎంతో బొట్టుగూడ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

నల్గొండ బ్యూరో , డైనమిక్ న్యూస్, నవంబర్ 29

పూర్వ విద్యార్థుల హర్షం

నల్గొండ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బొట్టుగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడంపై పాఠశాల పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి వెంకటరెడ్డికి ఘన సన్మానం

శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని పూర్వ విద్యార్థులు కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఏడు దశాబ్దాల చరిత్ర

దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర గల బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు సేవలందించారు. అనేకమంది ప్రముఖ ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించిన ఈ పాఠశాల ఇన్నేళ్లుగా ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది.

రూ. 8 కోట్లతో నూతన భవనం

పాఠశాలకు శాశ్వత భవనం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పూర్వ విద్యార్థులు విజ్ఞప్తి చేయగా, ప్రకాశం బజార్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో రూ.8 కోట్ల వ్యయంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం చేపట్టారు.

కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు

నూతన భవనంలో డిజిటల్ తరగతులు, కంప్యూటర్ విద్య, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియం బోధనకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్పొరేట్ స్థాయి వసతులతో నిర్మాణం కొనసాగుతోంది.

ప్రముఖుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థులైన నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ ఎన్. రఘుప్రసాద్, అడిషనల్ ఎస్‌పి పూర్ణచందర్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ, అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హలీం, గొట్టిపర్తి వేణుగోపాల్, ఏ. విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో సీఎం చేతుల మీద ప్రారంభం

నూతనంగా నిర్మిస్తున్న బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం పనులు దాదాపుగాపూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments