నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 18
నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తుమ్మడం శ్రీ కళా ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ మహోత్సవంలో నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి. కోటిరెడ్డి మంగళవారం పాల్గొన్నారు.
నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామ వాసులు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాతంగి గోవిందు కుమార్తె అనూష – కుమార్ వివాహానికి హాజరైన ఎమ్మెల్సీ, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కు ఎమ్మెల్సీ హాజరు
హైదరాబాద్ గండిపేట సమీపంలోని ఆర్యా కన్వెన్షన్ హాల్, శంకర్పల్లి రోడ్ జన్వాడలో నిర్వహించిన వివాహ రిసెప్షన్ మహోత్సవానికి ఎమ్మెల్సీ యం.సి. కోటిరెడ్డి హాజరయ్యారు.కోకాపేట వాస్తవ్యులు గట్టి కొప్పుల రాంరెడ్డి కుమారుడు పునీత్ రెడ్డి – సౌమ్య దుర్గ గార్ల రిసెప్షన్ సందర్భంగా ఎమ్మెల్సీ నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.
పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న కోటిరెడ్డి
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వెనిగండ్ల పీఎసీసీ చైర్మన్ కేవీ రామారావు,మిర్యాలగూడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి,అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
