డైనమిక్, నరసరావుపేట, నవంబర్ 15
పల్నాడు జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులుకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై ఆరా
జిల్లాలో కొనసాగుతున్న పలు పర్యాటక ప్రాజెక్టులపై కలెక్టర్ ఒక్కో అంశం పై క్షుణ్ణంగా సమీక్షించారు.స్వదేశీ దర్శన్‌లో భాగంగా నాగార్జునసాగర్ సమీపంలో వరల్డ్ క్లాస్ బుద్ధిష్ట్ హెరిటేజ్ సెంటర్.అమరావతి 125 అడుగుల బుద్ధుని విగ్రహం ఆధునీకరణ,గుత్తికొండ బిలం రోడ్డు నిర్మాణ పనులు,ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వద్ద జిప్ సైకిల్, జిప్ లైన్ ఏర్పాట్లు,ఈ పనుల పురోగతిపై సంబంధిత అధికారులు వివరాలు అందించారు.
నూతన వసతుల కోసం భూసేకరణపై చర్చ
నాగార్జునసాగర్ వద్ద టెంట్ సిటీ, బౌద్ధ అకాడమీ కోసం కావలసిన స్థల సేకరణపై కలెక్టర్ రెవెన్యూ అధికారులతో చర్చించారు.కొండవీడు ఘాట్ రోడ్ వద్ద పర్యాటక వసతి గృహం నిర్మాణానికి అవసరమైన భూమి పై కూడా వివరాలు తీసుకున్నారు.
అమరావతి పర్యాటక ప్రాంతాల ఆధునీకరణకు నిధుల సమీకరణ
అమరావతి పట్టణంలోని నూనెగుండం చెరువు, కాలచక్ర మ్యూజియం అభివృద్ధికి నిధుల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రాంతాలను త్వరగా ఆధునికరించి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
కోటప్పకొండ అభివృద్ధి కోసం డీపీఆర్ త్వరితగతిన సిద్ధం చేయాలి
కోటప్పకొండ అభివృద్ధి కోసం సిద్ధం చేస్తున్న డీపీఆర్‌ను వెంటనే పూర్తి చేసి, సాస్కి స్కీం నిధులను తీసుకురావాల్సిందిగా కలెక్టర్ స్పష్టం చేశారు.దైద బిలాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అధికారులంతా సమిష్టిగా పని చేయాలని అన్నారు.
సమీక్షలో పాల్గొన్నవారు
సమావేశంలో డివిజనల్ మేనేజర్ చైతన్య,
జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ,
ఎపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డి.ఈ. శ్రీనివాసరావు,కోటప్పకొండ ఈవో చంద్రశేఖర్
పాల్గొన్నారు.
