Monday, March 2, 2026
Homeతాజా సమాచారండ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఐ చరమంద రాజు

డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఐ చరమంద రాజు

డైనమిక్,పాలకవిడు, 5 నవంబర్

పాలకవిడు మండల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎస్‌ఐ కోటేష్, సీఐ చరమంద రాజు ఆధ్వర్యంలో డెక్కన్ ఫ్యాక్టరీ లారీ యార్డ్‌లో డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సీఐ చరమంద రాజు మాట్లాడుతూ

రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. వేగ పరిమితిని దాటి వాహనాలు నడపరాదని, రాత్రివేళల్లో అలసటతో డ్రైవింగ్ చేయకూడదని, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే డ్రైవర్లు ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యతతో వాహనాలు నడపాలని, రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments