Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పేదల సేవలో సీఎం చంద్రబాబు కదిరి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ – కాశీబుగ్గ ఘటనపై సంతాపం

పేదల సేవలో సీఎం చంద్రబాబు కదిరి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ – కాశీబుగ్గ ఘటనపై సంతాపం

డైనమిక్ డెస్క్,శసత్యసాయి జిల్లా, నవంబర్ 1

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లె గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో మేళవించి, పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.

వితంతు, వృద్ధాప్య పింఛన్లు స్వయంగా అందజేత

కార్యక్రమంలో సీఎం మేడా రెడ్యమ్మకు వితంతు పింఛన్, మేడా మల్లయ్యకు వృద్ధాప్య పింఛన్ స్వయంగా అందజేశారు.పింఛన్ అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, “సీఎం చేతుల మీదుగా పింఛన్ అందుకోవడం తమ అదృష్టం” అన్నారు.

ప్రజల వినతులు స్వీకరించిన సీఎం

గ్రామ సందర్శన సందర్భంగా సీఎం చంద్రబాబు గ్రామస్తుల నుంచి పలు వినతులు స్వీకరించారు.
తరువాత జరిగిన ప్రజావేదిక సభలో పాల్గొని, ప్రజా సమస్యలు మరియు గ్రామ అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిపారు.ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం

కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.ఒక ప్రైవేట్ వ్యక్తి బాధ్యతారాహిత్యంతో ఈ ప్రాణనష్టం జరగడం అత్యంత విచారకరం,” అని పేర్కొన్నారు.ప్రజావేదిక సభలో పాల్గొన్న వారందరూ కలిసి మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

పేదల సేవే మా ప్రభుత్వ ధ్యేయం

సీఎం మాట్లాడుతూ – “పేదల సేవే నా ధ్యేయం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే మా లక్ష్యం.ప్రతి గ్రామంలో అభివృద్ధి, ప్రతి ఇంటిలో సంతోషం కనిపించేలాగా కృషి కొనసాగిస్తాం” అన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments