Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంనల్గొండ జిల్లా ఆర్జాలభావి ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యం పరిశీలన చేసి రైతులను పరామర్శించిన మాజీ...

నల్గొండ జిల్లా ఆర్జాలభావి ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యం పరిశీలన చేసి రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్1

నల్గొండ పట్టణ పరిధిలోని ఆర్జాలభావి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీ ఏ సి ఎస్) కొనుగోలు కేంద్రంలో తుఫాన్ ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు, రైతులు ఆయనతో పాటు ఉన్నారు.

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ

జిల్లాలో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “పంటలు నష్టపోయి రైతులు పుట్టెడు దుఃఖంలో విలవిలలాడుతున్నారు. ఒక వైపు ప్రకృతి ప్రకోపం, మరో వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలను బలితీసుకుంటోంది” అని పేర్కొన్నారు.ప్రస్తుత ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన, “జిల్లా మంత్రులు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా కేవలం కమిషన్లు, సంపదలపైనే దృష్టి సారించారు. విదేశీ పర్యటనల్లో జల్సాలు చేస్తున్నారు. రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయల లంచాలు తీసుకొని వారికి సాగిలపడ్డారు. ఫలితంగా మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు” అని మండిపడ్డారు.రైతుల ఇబ్బందులను వివరించిన ఆయన, “ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనబడుతోంది. పత్తి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పంటలను పూర్తిగా కొనుగోలు చేసాం. కానీ ఈ ప్రభుత్వం రైతులను కష్టాల్లో నెట్టింది. యూరియా కొరతతో ఏడిపించింది, ఇప్పుడు ధాన్యం కొనక మళ్లీ ఏడిపిస్తోంది” అని విమర్శించారు.తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు తక్షణ నష్టపరిహారం అందించాలని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. “లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం న్నీ నిలదీస్తాం. రైతులు కూడా బయటికి వచ్చి మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నించాలి. తిరుగుబాటు చేస్తేనే న్యాయం సాధ్యమవుతుంది” అని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments