నల్లగొండ బ్యూరో,నవంబర్16 , డైనమిక్ న్యూస్
జాతీయ మెగా లోక్ అదాలత్లో నల్గొండ జిల్లా భారీ స్థాయిలో కేసుల పరిష్కారాన్ని సాధించింది. ఒక్కరోజులోనే 6362 కేసులు రాజీ మార్గంలో ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
విచారణలో ఉన్న 548 IPC కేసులకు పరిష్కారం
జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదుై, విచారణలో కొనసాగుతున్న 548 IPC కేసులు లోక్ అదాలత్లో రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు 2515
డ్రంక్ అండ్ డ్రైవ్, మోటార్ వాహన చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన 2515 కేసులు కూడా అదాలత్లో ముగిశాయి. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడంలో ఈ పరిష్కారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
3254 పెట్టి కేసుల క్లియరెన్స్
పోలీసుల పర్యవేక్షణలో చిన్నపాటి వివాదాలు, పెట్టి కేసులు 3254 రాజీ ప్రక్రియలో పరిష్కారమయ్యాయి. ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడంలో ఈ చర్యలు ఫలితాన్నిచ్చాయని అధికారులు తెలిపారు.
సైబర్ నేరాల పరిష్కారం – బాధితులకు 8.84 లక్షల రూపాయల చెల్లింపు
సైబర్ క్రైమ్ విభాగంలో నమోదు అయిన 45 కేసుల్లో, మోసపోయిన బాధితులకు 8,84,642 రూపాయలు తిరిగి అందజేశారు. సైబర్ నేరాలపై అవగాహన పెంపు అవసరమని ఎస్పీ సూచించారు.
లోక్ అదాలత్ విజయానికి పోలీసుల సమన్వయం కారణం
లోక్ అదాలత్ నిర్వహణకు ముందు నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి, రాజీ ప్రక్రియపై అవగాహన కల్పించడంలో పోలీసులు పకడ్బందీగా పనిచేసినట్లు ఎస్పీ తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు.

