సూర్యాపేట బ్యూరో, నవంబర్ 12 (డైనమిక్ న్యూస్)
సూర్యాపేట టుటౌన్ పోలీసులు మరోసారి తమ నేరచేదన నైపుణ్యాన్ని చాటారు. ఖరీదైన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పట్టుకుని, రూ.20 లక్షల విలువైన 26 బైకులను స్వాధీనం చేసుకున్నారు.బుదవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు.
ఎస్పీ నరసింహ మాట్లాడుతూ
“నేరాలకు పాల్పడితే ఎవ్వరూ తప్పించుకోలేరు.చట్టాన్ని గౌరవించాలి, నేరం చేసిన వారెవరైనా జైలు శిక్ష తప్పదు. ప్రజలు చట్టానికి లోబడి ఉండాలి,” అని ఎస్పీ పౌరులకు సూచించారు
నిందితుల వివరాలు
A1: వేమూరి కృష్ణ (57), తండ్రి రామయ్య, కట్టకొమ్ముగూడెం గ్రామం, చిలుకూరు మండలం.A2: రేఖల శివకుమార్ (30), తండ్రి వెంకన్న, ఆర్లగడ్డగూడెం గ్రామం, నకిరేకల్ మండలం.వృత్తి: HDFC బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్.
తనిఖీలలో పట్టుబడ్డ దొంగ
సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖమ్మం ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున వాహన తనిఖీలు జరుగుతున్న వేళ, అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తనిఖీ చేయగా అతడు వేమూరి కృష్ణ అని తేలింది. ఫింగర్ ప్రింట్ నెట్‌వర్క్ సిస్టం ద్వారా అతనిపై 150 పైగా బైక్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించారు.విచారణలో అతడు 26 బైకులు దొంగిలించినట్లు, వాటిలో 6 బైకులను రేఖల శివకుమార్ తో కలిసి దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.
బ్యాంక్ సెక్యూరిటీగా చేస్తూ మోసాలు
A2 రేఖల శివకుమార్ HDFC బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, తాను బ్యాంకు వాహనాల రికవరీ ఏజెంట్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేవాడు.
దొంగిలించిన బైకులను తన పరిచయస్తులకు అమ్మి లాభం పొందేవాడు. మిగిలిన బైకులను తన ఇంట్లో దాచిపెట్టినట్లు విచారణలో తేలింది.
నేర చేసిన విధానం
A1 వేమూరి కృష్ణ మద్యం వ్యసనంతో కుటుంబాన్ని వదిలి, పట్టణ ప్రాంతాల్లో రద్దీ ప్రదేశాల్లో పార్క్ చేసిన ఖరీదైన బైకులను రక్కీ చేసి దొంగతనాలకు పాల్పడేవాడు.A2 తో పరిచయం ఏర్పడిన తర్వాత ఇద్దరూ కలసి బైకులను దొంగిలించి అమ్మేవారు.
నిందితుల గత చరిత్ర
A1 వేమూరి కృష్ణ గతంలో పలు జిల్లాల్లో దొంగతనాల కేసుల్లో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అదే నేరాలకు పాల్పడ్డాడు.A2 శివకుమార్‌పై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
స్వాధీనం చేసిన బైకుల వివరాలు
సూర్యాపేట టుటౌన్6,మిర్యాలగూడ ఓన్ టౌన్9, మిర్యాలగూడటుటౌన్5, ఖమ్మం ఓన్ టౌన్2,ఖమ్మం టుటౌన్4 మొత్తం26 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్‌ఐ సురేష్, పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


