నేరేడు చర్ల, డైనమిక్,నవంబర్7
నేరేడు చర్ల మున్సిపాలిటీ కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వందేమాతర గేయం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఘనంగా సామూహిక గాన కార్యక్రమం నిర్వహించారు.
స్వాతంత్ర్యసంగ్రామ భేరి – ఏకతకు ప్రతీకగా వందేమాతరం
1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం స్వాతంత్ర్య సమరయోధుల్లో అపారమైన దేశభక్తిని నింపిందని, ఆ గీతం భారతీయుల ఏకతకు ప్రతీకగా నిలిచిందని పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై రవీంద్ర నాయక్, ఇంపాక్ట్ ప్రతినిధులు వీరవెళ్లి శ్రీలత, కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.అందరూ మానవహారంగా ఏర్పడి స్వరమై, మనసై వందేమాతరం గేయాన్ని గానం చేశారు.
దేశభక్తి నినాదాలతో మారుమోగిన పాఠశాల ప్రాంగణం
దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తి నింపేలా కార్యక్రమం సాగింది.వందేమాతర నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమోగి దేశప్రేమతో నిండిపోయింది.
