Wednesday, January 14, 2026
Homeజాతీయంయోగి మార్క్ ప్రజా పాలన — ప్రజాస్వామ్యానికి ప్రాణం

యోగి మార్క్ ప్రజా పాలన — ప్రజాస్వామ్యానికి ప్రాణం

లక్నో, డైనమిక్ డెస్క్,అక్టోబర్ 26

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన వినయంతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. సాధారణ పౌరుడొకరు వినతిపత్రం అందజేస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నప్పటికీ, యోగి నిలబడి ఆయన విన్నపాన్ని శ్రద్ధగా చదవడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమైంది.ఆ దృశ్యం ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకత్వానికి అద్దం పట్టింది. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే నాయకుడే ప్రజల మనసుల్లో నిలుస్తాడు అనే సత్యాన్ని యోగి ఆదిత్యనాథ్ తన ప్రవర్తనతో మరోసారి నిరూపించారు.

ప్రజాస్వామ్య బలం – ప్రజల గౌరవంలోనే!

ప్రభుత్వ పదవులు కేవలం అధికారం ప్రదర్శనకు కాకుండా సేవాధర్మానికి ప్రతీక కావాలని యోగి చూపించారు.సాధారణ ప్రజలతో సునిశితంగా మాట్లాడడం, వారి విన్నపాలను స్వయంగా పరిశీలించడం, అధికారుల సమక్షంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఇచ్చే ప్రాధాన్యం – ఇవన్నీ యూపీ పాలనలో కొత్త పంథాను తెచ్చాయి.

యోగి లాంటి నాయకులే ప్రజాస్వామ్యానికి జీవం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు గౌరవం ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసం నిలుస్తుంది. యోగి లాంటి నాయకులే ప్రజల నమ్మకాన్ని తిరిగి పెంచగలరు.
సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు ప్రతి ప్రజా ప్రతినిధి ఆయన తరహాలో ప్రజల పట్ల వినమ్రత, బాధ్యత చూపడం నేర్చుకోవాల్సిన సమయం ఇది.

పదవి శాశ్వతం కాదు – సేవే శాశ్వతం!

పదవులు తాత్కాలికం. కానీ ప్రజల మన్ననలు గెలుచుకునే సేవా ధోరణి మాత్రం చిరస్మరణీయం.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చూపిస్తున్న ప్రజా సేవా విధానం రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.ప్రజలు తమ ఓట్లతో ఎన్నుకున్న ప్రభుత్వాల పాలనే ప్రజాస్వామ్యం యొక్క అసలైన రూపం – యోగి పాలన ఆ స్ఫూర్తికి ప్రతీకగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments