Monday, March 2, 2026
Homeతాజా సమాచారంఅక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య భార్య లక్ష్మి, మేనల్లుడు గణేష్‌కు రిమాండ్

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య భార్య లక్ష్మి, మేనల్లుడు గణేష్‌కు రిమాండ్

డైనమిక్ న్యూస్, మాడ్గులపల్లి, ఫిబ్రవరి 1

మండలంలోని సీత్యా తండాకు చెందిన రమావత్ రవిని హత్య చేసిన కేసులో అతని భార్య దీరావత్ లక్ష్మి, ఆమె మేనల్లుడు గణేష్‌లను రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్సై కృష్ణయ్య శనివారం తెలిపారు.

పదిహేను ఏళ్ల క్రితం వివాహం

రమావత్ రవి (సీత్యా తండా) గత 15 సంవత్సరాల క్రితం మిర్యాలగూడ మండలం ఏడు కోట్ల తండాకు చెందిన దీరావత్ లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

అక్రమ సంబంధంతో కుటుంబ కలహాలు

లక్ష్మికి తన మేనల్లుడు గణేష్‌తో అక్రమ సంబంధం ఉండటంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. మృతుడు రవి మద్యం సేవించి భార్యతో గొడవ పడుతుండేవాడని వెల్లడించారు.

అర్ధరాత్రి ఘాతుకం

ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో లక్ష్మి తన మేనల్లుడు గణేష్‌తో కలిసి రోకలిబండతో రవిని వరిబీజాలపై కొట్టి, అనంతరం గొంతుపై కాలు తొక్కి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.

నిందితుడి పరారీ

హత్య అనంతరం గణేష్ తన టూ వీలర్‌పై అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు.

కేసు ఛేదించిన పోలీసులు

మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో స్థానిక పోలీస్ సిబ్బంది కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండ, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రిమాండ్‌కు తరలింపు

నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

అభినందించిన డీఎస్పీ

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన ఎస్సై కృష్ణయ్యతో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments