మఠంపల్లి, డిసెంబర్3,డైనమిక్ న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికలల్లో భాగంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ కి చెందిన అమరారపు వెంకటేశ్వర్లు ను గ్రామశాఖ ప్రకటించింది. ఈమేరకు గ్రామ శాఖ అధ్యక్షులు షేక్. కరీం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో పాటు రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధిపధకాలు మాకు అండగా ఉన్నాయని తప్పకుండ పెదవీడు గ్రామాన్ని కైవసం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలోయూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ చిలక కిషోర్ కుమార్,మొగిలి మట్టపల్లి యాదవ్, బుర్రి సుబ్బయ్య నాయుడు పలువురు నాయకులు పాల్గొన్నారు.
