Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంకమ్మంపాటి వెంకటయ్యకు నివాళులు… నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి. కోటిరెడ్డి

కమ్మంపాటి వెంకటయ్యకు నివాళులు… నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి. కోటిరెడ్డి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,తిరుమలగిరి (సాగర్) మండలం

గ్రామ ప్రముఖుడు కమ్మంపాటి వెంకటయ్య కన్నుమూత

తిరుమలగిరి(సాగర్) మండలంలోని బోయగూడెం గ్రామానికి చెందిన కమ్మంపాటి వెంకటయ్య నిన్న సాయంత్రం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది.

ఎమ్మెల్సీ యం.సి. కోటిరెడ్డి శ్రద్ధాంజలి

ఈరోజు బోయగూడెం గ్రామంలో వెంకటయ్య వారి నివాసానికి చేరుకున్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి. కోటిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనేక మంది నాయకుల హాజరు

ఎమ్మెల్సీతో పాటు మాజీ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బీవీ రమణ రాజు, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షుడు కూన్ రెడ్డి లింగారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు తెనాలి సాయిరామ్ రెడ్డి, మాలే సత్యం రెడ్డి, మండలి శ్రీనివాస్ యాదవ్, చల్లా సోమశేఖర్ యాదవ్, చల్లా కోటేష్ యాదవ్, డీలర్ రాంరెడ్డి, ఇరుమాది మన్మథ రెడ్డి, భాశం కోటేష్ యాదవ్, కంపసాటి వెంకన్న యాదవ్, రవి మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.అంత్యక్రియలకు గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments