ఏపి,విశాఖపట్నం, డైనమిక్ అక్టోబర్19
యారాడ బీచ్‌లో ఆదివారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మొత్తం తొమ్మిది మంది యువకులు కలిసి బీచ్‌కు వెళ్లి స్నానం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, వారిలో కొంతమంది హెచ్చరికలు పట్టించుకోకుండా సముద్రంలో లోతుగా ఈతకు వెళ్లారని అధికారులు వెల్లడించారు.గల్లంతైన యువకుల కోసం మత్స్యకారులు, పోలీస్ బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సముద్ర అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గాలింపు కార్యక్రమం కష్టతరంగా మారింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
