తాడేపల్లి, డైనమిక్ న్యూస్, నవంబర్ 29
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఈరోజు బీసీల ఆత్మగౌరవం నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు.
‘దొర వంశ’ గుర్తింపు
దొమ్మర సామాజిక వర్గీయులను గౌరవప్రదంగా ‘దొర వంశ’గా సంభోదించాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం బీసీ కులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా తీసుకున్న కీలక అడుగు అని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర పండుగలుగా జయంతులు
వాల్మీకి, వడ్డే ఓబన్న, సర్దార్ గౌతు లచ్చన్న జయంతులను రాష్ట్ర పండుగలుగా నిర్వహించామని చెప్పారు. భక్త కనకదాస జయంతిని శాశ్వత రాష్ట్ర పండుగగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి తెలిపారు.
భవన నిర్మాణం మరియు నిధులు
బీసీ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించగా, అమరావతిలో అన్నికులలకు భవనాలు నిర్మించే చర్యలు చేపట్టారు. ఈ ఏడాదే బీసీల అభ్యున్నతికి రూ.47 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు.
ఆదరణ 3.0 పథకం
త్వరలో ‘ఆదరణ 3.0’ పథకాన్ని ప్రారంభించి బీసీ వృత్తుదారులకు ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు చెప్పారు.
విద్యార్ధుల అభ్యున్నతి
బీసీ విద్యార్థుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే బీసీ అభ్యర్థులకు రెండో విడత ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్‌ను వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
దొర వంశ ప్రతినిధుల ధన్యవాదాలు
జీవో జారీపై దొర వంశ (దొమ్మర) సామాజిక వర్గీయులు తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు రావడంతో బాధపడినట్లు, ఎన్నికల సమయంలో సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. అధికారంలోకి రాగానే గౌరవప్రద గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. జీవో జారీ కావడంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దొర వంశ సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
