ఎపి డైనమిక్ డెస్క్,అన్నమయ్య జిల్లా, అక్టోబర్ 25
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచనల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.డీఈవో సుబ్రహ్మణ్యం ప్రకటన ప్రకారం అక్టోబర్ 27, 28 తేదీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు అమలులోకి వస్తాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అన్ని డివిజన్, మండల విద్యా అధికారులు హెచ్‌ఎంలకు సమాచారం అందజేయాలని సూచించారు. ఆదివారం (అక్టోబర్ 26) కూడా వారాంతపు సెలవు ఉండడంతో పాఠశాలలకు వరుసగా మూడు రోజుల సెలవు లభించింది.
