హైదరాబాద్,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం ప్రమాదం తృటిలో తప్పింది. రాంగ్ ట్రైన్ ఎక్కినట్లు గుర్తించిన మణిదీప్ అనే యువకుడు దిగేందుకు ప్రయత్నిస్తుండగా, రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడి కిందపడ్డాడు. ఈ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని సురక్షితంగా బయటకు లాగారు.సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో మణిదీప్ ప్రాణాలు రక్షించబడ్డాయి. రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
