నల్లగొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 12
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం (అక్టోబర్ 1)ను పురస్కరించుకొని, వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్స్ సాధికారత శాఖ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు
వయోవృద్ధుల పట్ల ప్రేమ, ఆప్యాయతతో మెలగాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ,“వయోవృద్ధులు ఆరోగ్యంగా, ఆయురారోగ్యంతో ఉన్నప్పుడు కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి. వారిని ప్రేమ, ఆప్యాయతతో గౌరవించాలి” అని పేర్కొన్నారు. ఈ రోజు నుండి నవంబర్ 12 నుండి 19 వరకు వయోవృద్ధుల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలతో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
వారోత్సవాల షెడ్యూల్
నవంబర్ 12: పోస్టర్ ఆవిష్కరణ, నవంబర్ 13: వృద్ధాశ్రమాలలో ఆటల పోటీలు, వినోద కార్యక్రమాలు,నవంబర్ 14: వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు,నవంబర్ 15: సీనియర్ సిటిజన్ హక్కులపై మారథాన్ వాక్,నవంబర్ 17: సీనియర్ సిటిజన్ చట్టం 2007పై అవగాహన కార్యక్రమాలు,నవంబర్ 18: ప్రజా ప్రతినిధుల కోసం అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అని తెలిపారు నవంబర్ 19: జిల్లా స్థాయి వయోవృద్ధుల వారోత్సవాల ఘన సమారోహం
సేవలకు గౌరవం
వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తులకు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.వి. కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ రాజ్ కుమార్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సముద్రాల మల్లికార్జున్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, వయోవృద్ధుల ఆశ్రమ కోఆర్డినేటర్ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
