నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 17
బుధవారం నాడు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు నేరేడుచర్ల మండలం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో మండల పరిధిలోని 16 సర్పంచ్ గ్రామపంచాయతీలు మరియు 151 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.
చట్టంపై అవగాహనతో ఎన్నికల్లో పాల్గొనాలి
ఎన్నికల సందర్భంగా ప్రజలంతా చట్టంపై అవగాహన కలిగి, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
144 సెక్షన్ అమల్లో ఉంది
ఎన్నికల నేపథ్యంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, పోలింగ్ కేంద్రాల పరిధిలో నలుగురికి మించి గుంపులుగా ఉండరాదని స్పష్టంగా హెచ్చరించారు.
చట్టం అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేయడం, అలాగే సత్ప్రవర్తన నిమిత్తం ముందుగా బైండోవర్ చేయబడిన వారిని మళ్లీ బైండోవర్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
సహకరించాలని విజ్ఞప్తి
ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
