Wednesday, January 14, 2026
Homedainamicమణుగూరులో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత 144 సెక్షన్...

మణుగూరులో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత 144 సెక్షన్ అమలు

కొత్తగూడెం జిల్లా, డైనమిక్,నవంబర్2

మణుగూరు పట్టణంలో ఆదివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణమంతా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చట్టం-సభ్యతను కాపాడే దృష్ట్యా అధికార యంత్రాంగం సీఆర్ఫీసీ 144 సెక్షన్ను అమల్లోకి తెచ్చింది.పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం, ముగ్గురికంటే ఎక్కువ మంది గుంపులుగా చేరితే లేదా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడాలని, అపోహలకు లోను కాకుండా చట్టాన్ని గౌరవించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments