డైనమిక్, కారం పూడి, నవంబర్ 12
తెలుగుదేశం పార్టీ పునాదులు కార్యకర్తల త్యాగాల మీద నిలిచాయని కారం పూడి మండల అధ్యక్షుడు గోళ్ల సురేష్ యాదవ్ అన్నారు. మాచర్లలో శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగిన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ—
“తెలుగుదేశం పార్టీని సాధారణ ప్రజల మనసుల్లో స్థిరపరిచిన మహానుభావుడు నందమూరి తారక రామారావు . ఆయన సంస్కరణలతో మూర్తీభవించిన మహనీయుడు. పార్టీకి శ్రమించిన ప్రతి కార్యకర్త మన బలం. నేటి టీడీపీ అభివృద్ధి వెనుక వారి త్యాగాలే ఉన్నాయ”న్నారు.అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పరిగెడుతోందని తెలిపారు. రాజధాని నిర్మాణం, పోలవరం, పెట్టుబడుల ప్రవాహం ఇవన్నీ చంద్రబాబు దూరదృష్టి ఫలితమని అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆయన సంకల్పమని చెప్పారు.జీవితాంతం పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని గోళ్ల సురేష్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం మండలంలోని ప్రతి కార్యకర్తను చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, మండల స్థాయి కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పరిగెడుతోందని తెలిపారు. రాజధాని నిర్మాణం, పోలవరం, పెట్టుబడుల ప్రవాహం ఇవన్నీ చంద్రబాబు దూరదృష్టి ఫలితమని అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆయన సంకల్పమని చెప్పారు.జీవితాంతం పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని గోళ్ల సురేష్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం మండలంలోని ప్రతి కార్యకర్తను చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, మండల స్థాయి కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

