Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో పనితీరు ను మెరుగు పరుచుకోవాలి :జిల్లా కలెక్టర్...

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో పనితీరు ను మెరుగు పరుచుకోవాలి :జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

డైనమిక్,నరసరావుపేట,అక్టోబర్17

జిల్లాలోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖను సక్రమంగా పనిచేసేలా చూడాలని, పనితీరును మెరుగు పరుచుకోవాలి అని అవసరాన్ని బట్టి పిల్లలను, గర్భవతులను, బాలింతలను రోజువారి కార్యక్రమాలను సక్రమంగా ప్రభుత్వ నిర్దేశిత ప్రకారం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారితో శాఖా పరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలని రోజు వారి విధులు ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని ముఖ్యంగా టీనేజ్, ప్రెగ్నెన్సీ, బాల్యవివాహాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించుటకు లోపపోషణకు గురి అయిన పిల్లల్ని గుర్తించి వారి యొక్క గృహ సందర్శన ద్వారా సరైన పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించ వలసిందిగా ప్రీస్కూల్ హాజరు పెంచవలసిందిగా మరియు జిల్లాలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయవలసిందిగా జిల్లాలోని సిడిపిఓ లకు సూపర్వైజర్లకు ఆదేశించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశం నకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఎం. ఉమాదేవి, బాల సంక్షేమ సమితి కార్యాలయ సభ్యులు సౌరిరాజు, వన్ స్టాప్ సెంటర్ కార్యాలయ సిబ్బంది, వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టులకు సంబంధించిన సిడిపివోలు కాంత కుమారి, శ్రీలత, శాంత కుమారి, అపరంజి జోష్న, వెంకటరమణ, రాజేశ్వరి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments