Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంవాగ్దేవి స్టడీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నేరేడుచర్ల మండల విద్యా అధికారి పుట్లూరు సత్యనారాయణ రెడ్డి...

వాగ్దేవి స్టడీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నేరేడుచర్ల మండల విద్యా అధికారి పుట్లూరు సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

నేరేడు చర్ల,డైనమిక్, అక్టోబర్ 26

నేరేడుచర్ల పట్టణంలో శ్రీనివాస్ థియేటర్ సమీపంలోని భవనంలో ఏర్పాటు చేసిన వాగ్దేవి స్టడీ హాల్‌ను ఆదివారం నేరేడుచర్ల మండల విద్యా అధికారి పుట్లూరు సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.

ఉద్యోగార్థులకు మేలైన అవకాశం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు వాగ్దేవి స్టడీ హాల్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని అన్నారు. దూర ప్రాంతాలకు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండానే తమ స్వగ్రామంలోనే సౌకర్యవంతమైన వాతావరణంలో చదివే వీలుందని పేర్కొన్నారు.

నిర్వాహకులను అభినందించిన ఎం ఈ ఓ

వాగ్దేవి స్టడీ హాల్‌ను ప్రారంభించిన సత్యనారాయణ రెడ్డి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకుడు చింతలచెర్వు గంగ రాజును అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కీలకమని అన్నారు.

పలువురు ప్రముఖులు హాజరు

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్, జెట్ పీ హెచ్ ఎస్ నేరేడుచర్ల హెచ్‌ఎం బట్టు మధు, అంజలి స్కూల్ కరస్పాండెంట్ అలక సైదిరెడ్డి, పినాకిల్ కరస్పాండెంట్ మహమ్మద్ మదార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments