డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 1
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లైములను తక్షణమే విడుదల చేయాలని నేరేడుచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు యారవ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శనివారం నేరేడుచర్లలో జరిగిన సంఘం ముఖ్య సమావేశంలో మాట్లాడుతూ, రోజూ కష్టపడి పనిచేసే కార్మికులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం కార్మికులు సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు.
సంక్షేమ బోర్డు బీమా మొత్తాలను పెంచాలి
సంక్షేమ బోర్డు ద్వారా అందించే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు, సాధారణ బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల అడ్డాలలో మౌలిక వసతులు కల్పించాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను పూర్తిగా కార్మికుల అభివృద్ధికే వినియోగించాలన్నారు.
లేబర్ కార్యాలయాల్లో అధికారులు ఉండాలి
లేబర్ కార్యాలయాలలో తగిన సిబ్బందిని నియమించి కార్మికులకు ఇబ్బంది లేకుండా చూడాలని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్, కోశాధికారి గుంజ రవీందర్, కోటేశ్వరరావు, షరీఫ్, అజయ్ కుమార్, కరీముల్లా, సైదా, మట్టయ్య, నరేష్, శ్రీను, నాగమ్మ, కొండలు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
