Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంరెండేళ్లలో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి – సీఎం రేవంత్ రెడ్డివైద్యారోగ్య, జీహెచ్ఎంసీ,...

రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి – సీఎం రేవంత్ రెడ్డివైద్యారోగ్య, జీహెచ్ఎంసీ, పోలీసు, ఆర్‌అండ్‌బీ శాఖలతో సమన్వయ కమిటీ ఏర్పాటు ఆదేశంరానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సదుపాయాల కల్పనపనుల పురోగతిపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీలు – సీఎం ఆదేశాలు

హైదరాబాద్‌, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 22

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంను రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. బుధవారం తన నివాసంలో ఆయన ఈ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేయాలని సూచించారు. అత్యాధునిక వైద్య పరికరాల సమీకరణకు అనుగుణంగా గదులు, ల్యాబ్‌లు, మౌలిక వసతులు నిర్మించాలన్నారు.అలాగే ఆసుపత్రి పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల అభివృద్ధి పనులును సమాంతరంగా చేపట్టాలని సీఎం సూచించారు. నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్, పోలీసు శాఖలతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ ప్రతి పదిరోజులకోసారి సమావేశమై క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు.పనులు పూర్తయ్యాక ఆసుపత్రి పరిసరాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని పోలీసు శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే ఆసుపత్రికి అనుసంధానమయ్యే రహదారుల ప్రణాళికను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరుగుతున్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణాలపై ప్రతి ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఆయా అధికారులు 24 గంటలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించి, వచ్చే జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని సూచించారు.ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి. శేషాద్రి, శ్రీనివాసరాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, క్రిస్టియానా జోంగ్తూ, ఇలంబర్తి, ముషారప్ అలీ ఫరూఖీ, హరిచందన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments