నేరేడుచర్ల, మార్చి 17 , డైనమిక్ న్యూస్
నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని అంబేద్కర్ జాగృతి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ జాగృతి సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి
గ్రామంలో వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని సంఘం నాయకులు తెలిపారు.
నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా మచ్చ భిక్షమయ్య, ఉపాధ్యక్షుడిగా మచ్చ వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా మచ్చ గోపాల్, కోశాధికారిగా ఒగ్గు వీరబాబు, సహాయ కార్యదర్శిగా ఆరే చిన్న సైదులు ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులు
చిత్రం లక్ష్మణ్, రెడపంగ ముత్తయ్య, మచ్చ కరుణాకర్, మచ్చ వెంకన్న, మచ్చ ఏడుకొండలు, చిత్రం వసుంధర్, వాట్యాల భార్గవ్, మచ్చ మహేష్, ఆరే అశోక్ కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు.
గౌరవ సలహాదారులు
మచ్చ అబ్రహం, మచ్చ పాపులు, మడుపు దేవయ్య, మచ్చ యేసయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
