Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్గుండెపోటుతో మృతి చెందిన మట్టపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ నేతల నివాళి

గుండెపోటుతో మృతి చెందిన మట్టపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ నేతల నివాళి

కారం పూడి,డైనమిక్ , అక్టోబర్ 27

మాచర్ల నియోజక వర్గ పరిధిలోనీ వెల్దుర్తి లో సోమవారం శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సోమవారం పాల్గొని తిరిగి వస్తుండగా కారంపూడి గ్రామానికి చెందిన మట్టపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందారు.

మృతదేహానికి టీడీపీ నేతల నివాళి

ఈ దుర్ఘటన తెలిసి టీడీపీ నేతలు శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.20,000 కుటుంబ సభ్యులకు అందజేశారు.

“శ్రీనివాసరావు మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది”

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ,శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పార్టీ నేతలు అన్ని విధాలుగా అండగా ఉంటారు” అని తెలిపారు.తదుపరి రోజుల్లో బ్రహ్మానందరెడ్డి స్వయంగా శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతుగా నిలుస్తారని వారు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులకు పార్టీ అండ

మరణించిన శ్రీనివాసరావుకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గోళ్ల సురేష్ యాదవ్,సీనియర్ నాయకులు మునుగోటి సత్యం,చప్పిడి రాము,బోల్నేడి శ్రీనివాసరావు,కటికల బాలకృష్ణ,తండా మస్తాన్ జానీ,
పట్టణ అధ్యక్షుడు బొమ్మిన శేషగిరి,సొసైటీ అధ్యక్షుడు నాగారపు రామకృష్ణ,బోల్నేడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments