మెదక్ జిల్లా, డైనమిక్,నవంబర్2
పెద్ద శంకరంపేట మండల పరిధిలోని వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం రాత్రి అక్రమ జూదం జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టాడీ షాప్ సమీప ప్రాంతంలో ఆకస్మిక దాడి చేపట్టారు.
ఆరుగురి అరెస్ట్ – రూ.17,709 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం
దాడి సందర్భంగా బొమ్మా బోరుసు (జూదం) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.17,709 నగదు మరియు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిని మరియు స్వాధీనం చేసిన వస్తువులను శంకరంపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించగా, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు – ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. జూదం, పేకాట, బెట్టింగ్ వంటి పనులు కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేస్తున్నాయి,” అని హెచ్చరించారు.
ఆరుగురు అరెస్టు వీరోజిపల్లి గ్రామ పరిసరాల్లో అక్రమ జూదం
“యువత తక్షణ లాభాల ఆశతో చెడు మార్గాలను ఎంచుకోవడం ఆందోళనకరం. కష్టపడి సంపాదించినదే శాశ్వతం. ప్రజలు కూడా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలి,” అని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.
