డైనమిక్ ,సూర్యాపేట బ్యూరో ,అక్టోబర్ 19
దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ . ప్రజలు సురక్షితంగా, ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంప్రదాయ పండుగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు.అధికారుల అనుమతి లేకుండా ఎక్కడపడితే అక్కడ బాణసంచా విక్రయాలు చేయవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర సంఘటనలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాణసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయ దారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల పేరుతో ఇతరులను ఇబ్బందులకు గురి చేయరాదని, మహిళలను గౌరవించాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ ప్రమాదాలకు దూరంగా ఉంటూ పండుగను శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని కోరారు
