సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 20
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న ఖమ్మం జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడిన కేసును సాంకేతిక ఆధారాలతో చేధించి, మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ కె. నరసింహ వెల్లడించారు.
శవంపై యాసిడ్, ఆనవాళ్లు చెరిపే ప్రయత్నం
టేకుమట్ల–ఖమ్మం హైవేపై పిల్లలమర్రి గ్రామ శివారులో సంచిలో కట్టి చిన్న కాలువలో పడేసిన మృతదేహాన్ని రూరల్ పోలీసులు గుర్తించారు. శవంపైన యాసిడ్ పోశి గుర్తుపట్టలేని విధంగా మార్చి వదిలిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలను డేటాబేస్‌లో పోల్చగా మృతుడు నాగవరపు సత్యనారాయణ @ సత్తిబాబు (కోనసీమ, ఏపీ)గా తేలింది.
కుటుంబ కలహమే హత్యకు కారణం
సత్యనారాయణ 2023లో హైదరాబాద్ బోయినపల్లిలో భార్య హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉన్నాడు. ఈ నెల 6న బెయిల్ పై బయటికి వచ్చాడు.బెయిల్‌పై వచ్చిన తర్వాత తమపై ప్రతీకారం తీర్చుకుంటాడనే భయంతో బామ్మర్ది మరియు అతని కుటుంబ సభ్యులు ఉమ్మడిగా హత్య పథకం రూపొందించినట్లు ఎస్పీ తెలిపారు.కోర్టు వాయిదాకు వచ్చిన సత్యనారాయణను సికింద్రాబాద్ కోర్టు వద్ద నిందితులు కారులో ఎత్తుకెళ్లి, గొంతు నొక్కి హత్య చేసి శవాన్ని సూర్యాపేట రూరల్ పరిధిలో పడేశారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు
ఫింగర్ ప్రింట్ డేటాబేస్,సీసీటీవీ పుటేజీలు,కాల్ డేటా విశ్లేషణ,ఈ ఆధారాలపై 9 మందిని గుర్తించి హైదరాబాద్–జీడిమెట్లలో అరెస్టు చేశారు.నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, తాళ్లు, క్లాత్, యాసిడ్ క్యాన్, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు
A1 గెల్లా కిరణ్ – 40సం., ఇంజనీరింగ్ వర్క్
A2 చీకురుమెల్లి మాధవరావు – 48సం., ఎలక్ట్రిషన్A3 దొండపాటి విశ్వనాథం – 49సం., రైతుA4 శివకుమార్ – 23సం., విద్యార్థి A5 మౌనిక – 24సం., విద్యార్థిని
A6 అమ్మాజీ – 46సం., టైలరింగ్
A7 నేతల సర్వేశ్వరరావు – 46సం., వ్యాపారి
A8 గిడ్డి రమేష్ – 33సం., డ్రైవర్
A9 గెల్లా షీలా – 43సం., ప్రైవేట్ ఉద్యోగి అందరూ ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం.
పోలీసుల ప్రావీణ్యాన్ని అభినందించిన ఎస్పీ
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐలు బాలు నాయక్, గోపీకృష్ణ, దర్యాప్తు పర్యవేక్షించిన డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఎస్పీ నరసింహ ప్రత్యేకంగా అభినందించారు.

