నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో జరుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నియంత్రణ గదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిస్థితులను పర్యవేక్షించారు.
సమస్యాత్మక కేంద్రాలను ముందస్తుగా గుర్తించిన జిల్లా యంత్రాంగం అక్కడ వెబ్‌కాస్టింగ్‌ను అమలు చేసింది. అవసరమైన కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు.
ఉదయం 7 గంటల నుంచే ప్రత్యక్ష పర్యవేక్షణ
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వెంటనే నియంత్రణ గదిలోని ప్రత్యేక బృందం వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాల పరిస్థితులను పరిశీలిస్తూ కలెక్టర్‌కు మరియు గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మికి నివేదించింది.
ప్రముఖ అధికారుల సమీక్ష
జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్‌లతో కలిసి కలెక్టర్ ఛాంబర్ నుంచే వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.ఆర్టీవోలతో మాట్లాడి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.జెడ్పీసీఈఓ శ్రీనివాస్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నార్కెట్పల్లి పోలింగ్ కేంద్రం సందర్శించిన సాధారణ పరిశీలకురాలు
ఇంతకుముందు జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి నార్కెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, బ్యారికేడింగ్, శానిటేషన్, 100 మీటర్ల పరిధిలో అమలు చేయవలసిన ఆచరణ నియమాలు వంటి అంశాలను పరిశీలించారు.
