Friday, March 13, 2026
Homeతాజా సమాచారంపదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు: ఎస్సై అజయ్ కుమార్

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు: ఎస్సై అజయ్ కుమార్

డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 13

పరీక్ష కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు

మోతే మండల కేంద్రంలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మోతే సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సిబ్బంది నియామకం – 144 సెక్షన్ అమలు

పరీక్షల సమయంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పరీక్ష కేంద్రం వద్ద పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

విద్యార్థులు ఆందోళన చెందవద్దు

విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని ఎస్సై అజయ్ కుమార్ సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద అనవసరంగా గుమికూడకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments