డైనమిక్, గుంటూరు,నవంబర్2
తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో, 9వ వార్డు టీడీపీ అధ్యక్షునిగా చిన్నంశెట్టి నరసింహనాయుడును ఎమ్మెల్యే నసీర్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ కేడర్ కృషి చేయాలని సూచించారు.గత దశాబ్దంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించిన నసీర్, ప్రస్తుతం రోడ్లు, సీసీ డ్రెయిన్లు వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని వెల్లడించారు.ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా స్థానిక నాయకులు వ్యవహరించాలి. ఏ సమస్య వచ్చినా ప్రజల కంటే ముందు నాయకులు స్పందించాలి” అని ఎమ్మెల్యే నసీర్ అన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లవుల అశోక్, జాగర్లమూడి శ్రీనివాస్, తలారి సాయిరామ్, రియాజ్, బట్ట రాజా, జెస్వంత్, శ్రీను నాయక్, పగడాల గోపి, దాసరి చంద్రకాంత్, తాడిబోయిన గణేష్ తదితరులు పాల్గొన్నారు.
