Wednesday, January 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరం ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాలావుద్దీన్

ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరం ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాలావుద్దీన్

ముస్లింలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం రూపొందించాలి

మంగళగిరి,డైనమిక్,అక్టోబర్19

ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరమని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాలావుద్దీన్ అన్నారు. ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఈద్గా ఫంక్షన్ హాల్లో
ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా విద్య, ఆర్థిక రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ముస్లింలకు ఉన్నత విద్యను అందించడంలో ప్రభుత్వం ముందుండాలని, ఆర్థిక వెనుకబాటుతనాన్ని నివారించేందుకు వనరులు సృష్టించాలని డిమాండ్ చేశారు. ఉర్దూ భాషను రాష్ట్ర రెండో భాషగా ప్రకటించినప్పటికీ, అధికార వ్యవహారాల్లో దానిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షలను అడ్డుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా ముస్లింల భద్రత కోసం ప్రత్యేక అట్రాసిటీ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు…రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉర్దూ విశ్వవిద్యాలయాలు స్థాపించాలనే తమ వేదిక డిమాండ్‌పై ప్రభుత్వం చర్యలు చేపడితే హర్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 30 శాతం ముస్లింలు ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్నారని, వారికి ఆర్థిక భరోసా కల్పించే విధానాలు ప్రభుత్వం రూపొందించాలని సూచించారు. రాజకీయ పార్టీలన్నీ ముస్లింలను కేవలం కార్యకర్తలుగా మాత్రమే చూసి, నాయకత్వ స్థాయిలో అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు చైర్మన్, కౌన్సిలర్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, ఉపాధ్యక్షులు మౌలా బేగ్ అలీ, రాష్ట్ర ట్రెజరర్ అబ్దుల్ కలాం, నాయకులు నూర్ఖాన్, అజీజ్ అబ్దుల్లా, నసీమా, మగబుల్ జాను, అనీష బాజీబి, యువత అధ్యక్షుడు ఖలీల్, లీగల్ సెల్ ఇన్‌చార్జ్ ఆసిఫ్ సైదా, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments