డైనమిక్,వినుకొండ, అక్టోబర్ 18
రైతులకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపుపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శనివారం వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో గల వై కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ
ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.రైతులు వినియోగించే వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర వ్యవసాయ అవసరాలపై జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను సవివరంగా వివరిస్తూ, ఈ పన్ను రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పన్ను రాయితీ చర్యలను గుర్తుచేసి, రైతులు వాటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
