Thursday, January 15, 2026
Homeతెలంగాణసూర్యాపేటలో స్వీట్స్, బేకరీలపై ప్రత్యేక తనిఖీలులేబుల్ లేని 60 కిలోల ఆహార పదార్థాలు సీజ్ –...

సూర్యాపేటలో స్వీట్స్, బేకరీలపై ప్రత్యేక తనిఖీలులేబుల్ లేని 60 కిలోల ఆహార పదార్థాలు సీజ్ – ఫుడ్ సేఫ్టీ అధికారి డా. బట్టి ప్రభాకర్

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 18

ఆహార భద్రతా ప్రమాణాల అమలులో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని స్వీట్ షాపులు మరియు బేకరీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ బట్టి ప్రభాకర్ తెలిపారు.

తనిఖీ చేసిన సంస్థలు

ఈ తనిఖీల్లో బెంగళూరు అయ్యంగార్ బేకరీ, డాల్ఫిన్ బేకరీ, ఎల్‌.ఎస్‌. బేకరీ, ఫేమస్ బేకరీ, మిఠాయి పోట్లం శ్రీ మిత్ర, శివ బేకరీలను పరిశీలించినట్లు ఆయన వివరించారు.

గుర్తించిన లోపాలు

తనిఖీలలో భాగంగా బేకరీలలో పరిశుభ్రత (Sanitary Maintenance) మరియు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene) పాక్షికంగా మాత్రమే పాటించబడుతున్నట్లు గుర్తించారు.సిబ్బందికి అవసరమైన వైద్య ధృవపత్రాలు (Medical Certificates) నిర్వహించకపోవడం కూడా బయటపడింది.

చేపట్టిన చర్యలు

సింథటిక్ రంగులు వాడకంతో కలిగే హానికర ప్రభావాలపై యజమానులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
అనుమానాస్పదమైన కొన్ని ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కి పరీక్షల నిమిత్తం పంపించారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేయించారు.లేబులింగ్ లేకుండా నిల్వ ఉంచిన సుమారు 60 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

హెచ్చరిక

ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించే వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments