నేరేడుచర్ల, డిసెంబర్ 3, డైనమిక్ న్యూస్
మూడవ విడత ఎన్నికల నామినేషన్లు జరుగుతున్న నేరేడుచర్ల మండలం దిర్షినిచర్ల గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ చరమంద రాజు నేరేడు చర్ల ఎస్ ఐ రవీందర్,తహసిల్దార్ సురిగీ సైదులు తో కలిసి పరిశీలించారు.
100 మీటర్ల పరిధిలో ఆంక్షలు తప్పనిసరి
నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిర్బంధాలు పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అనుమతిలేని వ్యక్తులు కేంద్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల అధికారి సూచించిన నియమ నిబంధనలు శాతం శాతం అమలు కావాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ముందస్తు బైండోవర్ చర్యలు
ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై రూ.5 లక్షల వరకు ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
మూడు విడతల్లో భారీ బందోబస్తు
మూడు విడతల ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు 1500 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
మొదటి విడతలో – 47 సమస్యాత్మక గ్రామాలు
రెండవ విడతలో – 65 సమస్యాత్మక గ్రామాలు
మూడవ విడతలో – 58 సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు ప్రతి గ్రామంలో తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
