సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 14
గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో మునగాల మండలం కళకోవ గ్రామంలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఓటింగ్ సరళిని దగ్గరుండి పరిశీలించి, ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఎస్పీ ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు.
