Wednesday, January 14, 2026
Homeఅంతర్జాతీయంతండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో నివసించే హక్కు లేదు: రాజస్థాన్ హైకోర్టు

తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో నివసించే హక్కు లేదు: రాజస్థాన్ హైకోర్టు

జైపూర్, డైనమిక్ న్యూస్ డెస్క్, నవంబర్24

తండ్రి అనుమతి లేకుండా ఆయన ఇంట్లో కొడుకు నివసించేందుకు ఎలాంటి హక్కు ఉండదని రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సవాయ్ మాధోపూర్‌ జిల్లాకు చెందిన తండ్రి–కొడుకుల మధ్య నెలకొన్న ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.తన బాగోగులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ, కొడుకు–కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, తండ్రి అనుమతి లేకుండా కొడుకు పితృగృహంలో ఉండటం చట్టపరంగా సమంజసం కాదని స్పష్టం చేసింది. కొడుకు వాదనలను తోసిపుచ్చిన కోర్టు, ఇంటి యజమానికి తన ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని, అనుమతి నిరాకరించిన సందర్భంలో ఎవరూ ఆ ఇంట్లో నివసించలేరని స్పష్టం చేసింది.అదుపు తప్పుతున్న నేటి యువతకు ఈ తీర్పు నీతి బోధ చేసేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబ వ్యవస్థ, పెద్దల గౌరవం కాపాడే దిశగా ఇది మార్గనిర్దేశకంగా నిలుస్తుందని అభిప్రాయపడింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments