నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 27
మన దేశ రాజ్యాంగం గతకాలపు జీవిత అనుభవాలు, వర్తమాన ఆకాంక్షలు, భవిష్యత్ మార్గనిర్దేశాలను మిళితం చేసుకొని రాజకీయ, సామాజిక ప్రజాస్వామ్యమే స్ఫూర్తిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించారని నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డా. మద్దిమడుగు సైదులు అన్నారు.
రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పాల్గొన్న డా. సైదులు రాజ్యాంగ విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్న సాంస్కృతిక వారసత్వాలను ఏకం చేస్తూ రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా నిలిచిందన్నారు.
సార్వభౌమత్వం, సమానత్వానికి ప్రాధాన్యత
భారత రాజ్యాంగం ప్రజలందరికీ సార్వభౌమత్వం, సమానత్వం, ప్రజాస్వామ్యం కల్పించడంలో కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు.
ప్రవేశిక ప్రతిజ్ఞ నిర్వహణ
అనంతరం పౌరశాస్త్ర అధ్యాపకురాలు గంధం సునీత అధ్యాపకులు, విద్యార్థులతో ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు.
పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రణతి, కె.ఎల్.ఎన్. రావు, శ్రీనివాసులు, వెంకన్న, నరసింహ చారి, గణేష్, ప్రసాదు, వీర నాయక్, అలాగే సిబ్బంది అన్వేష్, సుశాంత్, దుర్గయ్య, జాన్ ఆఫ్ ఖాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
