కరువు కోరల్లో నేరేడుచర్ల.. బియ్యం ధరలు భగ్గు! సామాన్యుడికి అందని బియ్యం.. కిలో రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు రూ.49కే బియ్యం అందిస్తామన్న హామీ ఏమైంది? అధికారుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమా?

ముఖ్యమైన పాయింట్స్:కరువు కోరల్లో నేరేడుచర్ల.. బియ్యం ధరలు భగ్గు!సామాన్యుడికి అందని బియ్యం.. కిలో రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలురూ.49కే బియ్యం అందిస్తామన్న హామీ ఏమైంది?అధికారుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమా? నేరేడుచర్ల, నవంబర్ 7, శుభోదయ డైనమిక్ వార్త కరువు పరిస్థితులు నేరేడుచర్ల మండల ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సరైన వర్షాలు లేక సాగునీటి సమస్యలు తీవ్రం కావడంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. సాగర్ ఆయకట్టు పరిధిలో నీటి కొరత, బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులు తగ్గడంతో కూలీలకు ఉపాధి కరువవుతుండగా, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం సామాన్య కుటుంబాలకు భారంగా మారుతోంది....