నీటి నిల్వ పనులకు ప్రజలు అధిక ప్రాధాన్యతనివ్వాలి సర్పంచ్ దున్నా శ్రీనివాసులు
ముఖ్యమైన పాయింట్స్:నీటి నిల్వ పనులకు ప్రజలు అధిక ప్రాధాన్యతనివ్వాలిసర్పంచ్ దున్నా శ్రీనివాసులు నడిగూడెం, నవంబర్ 4 (శుభోదయ డైనమిక్ వార్త): భవిష్యత్తులో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం చేపడుతున్న నీటి నిల్వ, జల సంరక్షణ పనులకు రైతులు, ప్రజలు అధిక ప్రాధాన్యతనిస్తూ సహకరించాలని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాసులు కోరారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో జల సంరక్షణ కుంట పనులను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా జల సంరక్షణ కుంటలు,...