ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇవ్వాలి బెల్లంకొండ సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి

ముఖ్యమైన పాయింట్స్:ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇవ్వాలిబెల్లంకొండ సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నడిగూడెం, నవంబర్ 4 (శుభోదయ డైనమిక్ వార్త): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం చెల్లించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని చేపట్టిన ప్రచారంలో భాగంగా బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా...