మురుసు తుఫానుతో నేలకొరిగిన వరి పంటలు! రైతులకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి

ముఖ్యమైన పాయింట్స్:మురుసు తుఫానుతో నేలకొరిగిన వరి పంటలు!రైతులకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి శుభోదయ డైనమిక్ న్యూస్ – మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మురుసు తుఫాను ప్రభావంతో వరి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఈదురుగాలులు, వర్షాల ధాటికి దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే సాగు పెట్టుబడులతో ఇబ్బందులు పడుతున్న రైతులు, పంట నష్టంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.