దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన కీసర సంతోష్ రెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన కీసర సంతోష్ రెడ్డి మోతే, శుభోదయ డైనమిక్ న్యూస్, నవంబర్ 2 మోతే మండలం ఒళ్ళుగొండ గ్రామ సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లును పరామర్శించిన అనంతరం, స్వర్గీయ మొక్క నాగమ్మ దశదినకర్మ కార్యక్రమంలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొక్క నాగమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.