పర్యావరణ పరిరక్షణలో నేరేడుచర్ల పాఠశాల సత్తా గ్రీన్ రెవల్యూషన్ అవార్డుల్లో జిల్లా స్థాయి ప్రథమ బహుమతి కైవసం ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు

ముఖ్యమైన పాయింట్స్:పర్యావరణ పరిరక్షణలో నేరేడుచర్ల పాఠశాల సత్తాగ్రీన్ రెవల్యూషన్ అవార్డుల్లో జిల్లా స్థాయి ప్రథమ బహుమతి కైవసంఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు నేరేడుచర్ల, అక్టోబర్ 31, శుభోదయ డైనమిక్ న్యూస్: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు గుర్తింపు లభించింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని సాధించి ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (CGR) ఈ పురస్కారాన్ని అందజేసింది. పర్యావరణ హిత కార్యక్రమాలకు ప్రాధాన్యత పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించడం, మొక్కలు నాటడం,...