పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోతసర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 30 మండల పరిధిలోని కందులవారిగూడెం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి కొబ్బరికాయ కొట్టి, ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, హౌసింగ్ ఏఈ వంశీ, పంచాయతీ కార్యదర్శి శోభన్ తదితరులు పాల్గొన్నారు.